
తెలంగాణలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 83,763 కరోనా పరీక్షలు నిర్వహించగా 455 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,45,406కు చేరింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,805కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 648 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారిసంఖ్య 6,32,728కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,873 యాక్టివ్ కేసులు ఉన్నాయి.