
రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం సాధ్యమైన చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ కు అందజేశారు. గ్రీన్ కో సంస్థ ప్రభుత్వానికి అందజేసేందుకు చైనా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను దిగుమతి చేసుకుంది. కన్సంట్రేటర్లు అందజేసిన గ్రీన్ కో సంస్థకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడికి అన్ని రకా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్సిజన్, ఔషధాల సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరామని పేర్కొన్నారు.