ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,48,881 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 853 అడుగులకు నీరు చేరింది. దీని పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 86.8390 టీఎంసీలుగా నమోదైంది.