వ్యాక్సిన్లపై మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

దేశంలో కరోనా కల్లోలానికి విరుగుడు కేవలం వ్యాక్సిన్లు మాత్రమే. ఆ వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో వేస్తే కరోనాను అరికట్టేనట్టే ఇప్పటికే దేశంలో 40 కోట్లకు పైగా జనానికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉచితంగా టీకా కార్యక్రమం చేపట్టిన కేంద్రం అందుకు అనుగుణంగా కంపెనీల నుంచి వ్యాక్సిన్ల సేకరణను పెంచింది. కోవిడ్ టీకాల కొరత లేకుండా చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించగలమని తెలిపింది. జులై […]

Written By: NARESH, Updated On : July 24, 2021 11:00 am
Follow us on

దేశంలో కరోనా కల్లోలానికి విరుగుడు కేవలం వ్యాక్సిన్లు మాత్రమే. ఆ వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో వేస్తే కరోనాను అరికట్టేనట్టే ఇప్పటికే దేశంలో 40 కోట్లకు పైగా జనానికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉచితంగా టీకా కార్యక్రమం చేపట్టిన కేంద్రం అందుకు అనుగుణంగా కంపెనీల నుంచి వ్యాక్సిన్ల సేకరణను పెంచింది. కోవిడ్ టీకాల కొరత లేకుండా చేస్తోంది.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించగలమని తెలిపింది. జులై 20 నాటికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం 34.83 కోట్ల డోసులను ఉచితంగా సరఫరా చేసినట్లు కేంద్రం తెలిపింది.

ఇక కేంద్రం మరో భారీ టార్గెట్ పెట్టుకుంది. ఈ ఏడాది ఆగస్టు-డిసెంబర్ మధ్యకాలంలో మరో 135 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. దేశీయ టీకా తయారీదారులతో వ్యాక్సిన్ సేకరణ , వాటి సరఫరా, నిర్వహణ ఖర్చుల కోసం ఇప్పటివరకు ఏకంగా 9725.15 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.

ఇప్పటికే కేంద్రం మే1 నుంచి జూన్ 21 వరకు అమలు చేసిన సరళీకృత టీకా సేకరణ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు 4.57 కోట్ల డోసులు కొనుగోలు చేశాయని వెల్లడించారు. ఈ విధానం అమలైన కాలంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గినట్లు అంగీకరించారు.

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 2,49,648 డోసులు వృథాగా అయ్యాయని కేంద్రం తెలిపింది. వైద్య సిబ్బంది అప్రమత్తతో వేయడం వల్ల అదనంగా 41,11,515 డోసులు అదనంగా అందుబాటులోకి వచ్చినట్లు కేంద్రం తెలిపింది..