మమతా బెనర్జీకి తెలుగు సీఎంలతోనే తలనొప్పి?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. బెంగాల్ కేంద్రంగా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, డీఎంకే వంటి పార్టీలను కలుపుకుని పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. బీజేపీని గద్దె దింపే పనిలో భాగంగా ముందుకునడుస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, డిల్లీ, దక్షిణాది స్టేట్లు లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. ఒక అడుగు వెనక్కి తగ్గి ముందుగా ఐక్య ఫ్రంట్ […]

Written By: Srinivas, Updated On : July 24, 2021 10:53 am
Follow us on

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. బెంగాల్ కేంద్రంగా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, డీఎంకే వంటి పార్టీలను కలుపుకుని పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. బీజేపీని గద్దె దింపే పనిలో భాగంగా ముందుకునడుస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, డిల్లీ, దక్షిణాది స్టేట్లు లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. ఒక అడుగు వెనక్కి తగ్గి ముందుగా ఐక్య ఫ్రంట్ ను గెలిపించడం పైనే ఫోకస్ పెడుతున్నారు.

విపక్షాలపై ఒత్తిడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ తన ప్రభావం చూపాలని చూస్తున్నారు. పార్టీలను ఏకం చేసే క్రమంలో మిగిలిన నేతలను తన వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ఉంటే తమకు ఇబ్బంది తప్పదని భావిస్తున్నారు. మమతా బెనర్జీ పిలుపు పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది ఎన్సీపీ అధినేత శరత్ పవార్ దీనికి నాయకత్వం వహించాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు స్టేట్ల పరిస్తితి పూర్తిగా భిన్నం. కేసీఆర్, జగన్ కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాలపై పట్టించుకోవడం లేదు. మూడో ఫ్రంట్ ఏర్పడితే మద్దతు ఇస్తారో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం థర్డ్ ఫ్రంట్ తో కలిసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది టీడీపీ మాత్రం ఎటు తేల్చుకోలేకపోతోంది. బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోంది.

మమతా బెనర్జీ ఈనెల 26,27,28 తేదీల్లో ఢిల్లీలోనే మకాం వేయబోతున్నారు ఈసందర్భంగా అన్ని పార్టీలను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్లో అవలంబించబోయే వ్యూహాలకు పదును పెడుతున్నారు. దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో మమత నిమగ్నమయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సైతం తమ గ్రూపులో చేర్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు.