
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.23 గంటల సమయంలో సెన్సెక్స్ 103 పాయింట్ల ఎగబాకి 53,029 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 26 పాయింట్ల లాభపడి 15,886 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.21 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.