
తూర్పు గోదావరి జిల్లాలోని వశిష్ట గోదావరి నదిలో గల్లంత్తైన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. లంకలగన్నవరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు రత్నసాగర్, బండారు నవీన్, పంతాల పవన్, ఖండవిల్లి వినయ్ పి. గన్నవరం పరిధిలోని గోదావరిలో నిన్న స్నానానికి వెళ్లారు. అక్కడ ఆడుకుంటూ నదిలో గల్లంత్తైయ్యారు. విద్యార్థుల ఆచూకీ ఎంత సేపటికీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. రత్న సాగర్, నవీన్, వపన్ మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మరొకరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.