
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి. 979 మంది చనిపోయారు. మరో 58,578 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,79,331కి చేరింది. కోలుకున్న వారు 2,93,09,607 మంది కాగా యాక్టివ్ కేసులు 5,72,994గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 3,96,730 మంది మరణించారు.