spot_img
Homeఎంటర్టైన్మెంట్Mangli controversy : పాపం మంగ్లీ: వల్ల కావడం లేదట..నలిగిపోతుందట.. మీడియా ఇన్వెస్టిగేషన్ చేయాలట..

Mangli controversy : పాపం మంగ్లీ: వల్ల కావడం లేదట..నలిగిపోతుందట.. మీడియా ఇన్వెస్టిగేషన్ చేయాలట..

Mangli controversy : చేసింది మొత్తం చేసేసి.. నెపం మొత్తం పక్కింటి వారి మీద తోసేసిందట వెనకటికి ఓ మహానుభావురాలు. సేమ్ ఇప్పుడు ప్రఖ్యాత గాయనిగా చెప్పుకుంటున్న మంగ్లీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పటికే అనేక వివాదాలలో పీకలలోతూ కూరుకుపోయి ఉంది. శ్రీకాళహస్తి లో పాట షూటింగ్.. బర్త్డే పార్టీలో మాదక ద్రవ్యాలు కనిపించడం.. తాజాగా మైక్రో ఫైనాన్స్ పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం .. ఇలా ప్రతి విషయంలోనూ మంగ్లీ పేరు వినిపిస్తుంది.

మీడియా మీద రుసరుసులాడుతోంది కానీ.. మీడియాకు ఆ స్థాయిలో వార్తలు అందించేదే మంగ్లీ. గతంలో తనకు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినప్పటికీ.. ఏ రాజకీయ పార్టీకి తరపున కూడా తను ప్రచారం చేయలేదని.. పాటలు పాడలేదని చెబుతోంది. ఎన్నికల సమయంలో వైసిపి తరఫున పాటలు పాడింది.. ప్రచారం చేసింది ఇదే మంగ్లీ కదా. తనకు రాజకీయ వాసనలు అంటే పడవని చెప్పింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్ట్ లో కొనసాగింది తనే కదా.. అంతటి నాగార్జునను సైతం బాయిలోనే బల్లి పలికే పాట తను రూపొందించిందని.. చెప్పుకుంది కదా.. ఇలా ఆమె గురించి రాసుకుంటూ పోతే బోలెడు..

తాజాగా మంగ్లీ ఏమంటుంది అంటే.. సుబ్బారావు వల్ల తను ఇబ్బంది పడుతోందట. వేదన అనుభవిస్తోందట. నిద్రలేని రాత్రులు గడుపుతోందట.. మీడియా ఇన్వెస్టిగేషన్ చేయాలట. మీడియా వార్తలు రాసే ముందు సంప్రదించాలట. తను ప్రతి సందర్భంలోనూ మీడియా మీద అంత ఎత్తున ఎగిరి పడుతోంది. కానీ సుబ్బారావు ఈ రోజు కూడా మీడియా విషయంలో నోరు జారలేదు. మీడియాకు లక్ష్మణ రేఖ గీయలేదు. మీడియా ఏం చేయాలో చెప్పలేదు. తనకు ఎదురైన అనుభవాన్ని మాత్రమే అతడు చెప్పాడు. కానీ మంగ్లీ మాత్రం పూర్తి డిఫరెంట్. ఏం రాయాలో.. ఎలా వ్యవహరించాలో మీడియాకు తనే చెబుతోంది. పైగా తనది మీడియా ఫ్యామిలీ అంటోంది.

ఇక్కడ మంగ్లీ మర్చిపోయిన విషయం ఏంటంటే.. మీడియా అనేది ఇన్వెస్టిగేషన్ చేయదు. ఆ కాలం మీడియా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు అంతా కూడా సెన్సేషన్ చుట్టూ తిరిగే మీడియా మాత్రమే ఉంది. ఇప్పుడు మంగ్లీ వ్యవహారం హాట్ టాపిక్ కాబట్టి మీడియా ఆమె వార్తలను మాత్రమే ప్రసారం చేస్తుంది. రేపొద్దున ఇంకొక విషయం దొరికితే మంగ్లీని మర్చిపోతోంది. మీడియా హౌస్ లో పని చేశానని.. తనది మీడియా కుటుంబమని చెప్పుకుంటున్న మంగ్లీకి ఈ మాత్రం తెలియదా.. ఈ మాత్రం తెలియకుండానే తను మీడియా హౌస్ లో పని చేసిందా.. తను బంజారా ఆడబిడ్డనని చెప్పుకుంటున్న మంగ్లీ.. ఆ బంజారాల కోసం ఏం చేసినట్టు.. ఆయన ఇక్కడ కులం కార్డు కోసం అవసరమేముంది.. ఆ కులం వాళ్లకు చెప్పి తను పాటలు పాడిందా.. నామినేటెడ్ పోస్ట్ వాళ్లకు చెప్పే తీసుకుందా.. ఏమో కాస్త సెలబ్రిటీ హోదా రాగానే చాలామందికి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. అందులో మంగ్లీ కూడా ఒకరు.. పాపం మంచిగా పాటలు పాడుకోక ఏంటి తల్లి నీకు ఈ వివాదాలు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular