Mana Shankara Varaprasad Collections : ఈ సంక్రాంతికి దాదాపుగా విజేత దాదాపుగా దొరికేసినట్టే. భారీ అంచనాల నడుమ నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ తో మొదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu) చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తనలోని వింటేజ్ కామెడీ టైమింగ్, సెంటిమెంట్ ని బయటకు తీసి వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వల్ల ఈ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిందని, మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు చిరంజీవి వన్ మ్యాన్ షో లాగా ఈ చిత్రం నడిచిందని, చిన్నప్పటి నుండి ఎలాంటి చిరంజీవి చూసి ఆయన్ని అంతలా ఫ్యాన్స్ అభిమానించారో, అలాంటి చిరంజీవి ని మరోసారి వెండితెర పై చూపడం తో, మెగా ఫ్యాన్స్ పూనకాలు వచ్చి ఊగిపోతున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ని ఆడియన్స్ తెగ ఇష్టపడుతున్నారు.
సంక్రాంతికి చిరంజీవి సినిమాకు రావాల్సిన టాక్ అయితే వచ్చేసింది. మరి ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. గత సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఎవ్వరి అంచనాలకు అందకుండా, ఏకంగా 275 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ కూడా ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడుతుందా అని ట్రేడ్ విశ్లేషకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాన్ని దాటేస్తాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓజీ చిత్రం ఫుల్ రన్ లో 320 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కూడా ఆ రేంజ్ వసూళ్లను రాబడుతుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఆ రేంజ్ వసూళ్లు రావాలంటే ఈ చిత్రం కచ్చితంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రేంజ్ లో లాంగ్ రన్ ని సంపాదించాలి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఆ రేంజ్ లో లాంగ్ రన్ ని సొంతం చేసుకోవడానికి గల కారణం, ఆ చిత్రానికి పోటీగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ అవ్వడం, ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని ఆడియన్స్ అంతగా పట్టించుకోకపోవడం. ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ కి కూడా ‘రాజా సాబ్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవ్వడం బాగా కలిసి రావొచ్చు. కానీ విడుదల అవ్వబోతున్న మూడు సినిమాల్లో ఒక్క దానికి పాజిటివ్ టాక్ వచ్చినా టార్గెట్ చేరుకోలేకపోవచ్చు. కానీ సంక్రాంతికి ఏదైనా జరగొచ్చు అనేది చాలా సార్లు నిరూపితమైంది కాబట్టి, ఓజీ ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.