కొండగట్టు.. తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి. ఆంజనేయుడు కొలువై భక్తులకు అభయమిస్తున్న క్షేత్రం. పవర్ స్టార్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇలవేల్పుగా భావిస్తున్న ఆంజనేయస్వామి ఆలయం. తనకు కొండగట్టు అంజన్న పునర్జన్మనిచ్చాడని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయంగా రూ.35.5 కోట్ల టీటీడీ నిధులతో ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొండగట్టు రిగి ప్రదక్షిణకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పవన్ రాకతో కొండగట్టులో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. తాజాగా గిరి ప్రదక్షిణ రహదారి ప్రాజెక్టుకు అధికారులు ఆమోదం తెలిపారు. 6 కిలోమీటర్ల పొడవు రోడ్డును అభివృద్ధి చేయాలని కలెక్టర్ నిర్ణయించారు.
ప్రాజెక్టు ఆకృతి ఇలా..
జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ గిరిప్రదక్షిణ స్థలాన్ని మంగళవారం(జనవరి 6న) పరిశీలించారు. ప్లాన్‌కు ఆమోదం తెలిపారు. మొత్తం ఆరు కిలోమీటర్లలో మూడు కిలోమీటర్లు ఘాట్ ఉంఇ. 50 అడుగుల వెడెల్పు, ఫుట్‌పాత్‌లతో దీనిని అభివృద్ధి చేస్తారు. నిధులు అంచనా వేసి టెండర్లు పిలవనున్నారు.
పవన్ కళ్యాణ్ చొరవ..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనను వాస్తవం చేయబోతున్నారు. అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో 96 గదుల సంత్రం, మాల విరమణ మండపం నిర్మించనున్నారు. దీంతో ఆలయ అభివృద్ధి వేగం అందుకుంది. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్యానికి చిహ్నం.