Grameena Upadi Hami Scheme: కేంద్ర ప్రభుత్వం( central government) ఉపాధి హామీ పథకం పేరును మార్చిన సంగతి తెలిసిందే. పేరు మార్పు తో పాటు పని దినాల పెంపు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాల్లో మార్పులు, పనుల సంఖ్య కూడా మారింది. కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలను చేసింది. వీటితో పాటు చెల్లింపుల ప్రక్రియను కూడా మార్చింది. మరోవైపు వేతనం జమ చేసే బ్యాంకు ఖాతాలపై కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వేతనాలను ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లో జమ చేయరు. కేవలం పోస్ట్ ఆఫీస్ ఖాతాలతో పాటు జాతీయ బ్యాంకు ఖాతాల్లో మాత్రమే వేతనాన్ని జమ చేయనున్నారు.
* పథకంలో సమూల మార్పులు..
దశాబ్దాలుగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకాన్ని ‘విబిజి రామ్ జిగా'( vbg Ramji ) మార్చారు. వేతన చెల్లింపు ప్రక్రియలను మార్పులు చేపట్టారు. ఈ పథకంలో భాగంగా ఎప్పటి వరకు పనిచేసిన కూలీలకు వారి పని దినాలకు సంబంధించిన వేతనాలను వారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. అయితే ఇకనుంచి వ్యక్తిగత ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లో వేతనం జమ చేయకూడదని.. కేవలం జాతీయ బ్యాంకుల్లో మాత్రమే జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఉన్నా పర్వాలేదు. ఆ ఖాతాలో జమ చేస్తారు.
* గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు చెల్లవు..
ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ బ్యాంకుల్లో( Gramin Vikas Bank) ఖాతాలు ఉన్న ఉపాధి హామీ వేతనదారులు వారి అకౌంట్లను మార్చుకుంటున్నారు. జాతీయ బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీస్ లో కొత్తగా అకౌంట్లను తెరుస్తున్నారు. అయితే ఈ నిబంధన పై వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ బ్యాంకులు తక్కువగా అందుబాటులో ఉన్నాయి. అందుకే కొత్తగా, ఉన్నఫలంగా ఖాతాలు తెరవాలంటే ఇబ్బందికరంగా మారుతుంది. కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ జాతీయ బ్యాంకులకు చేరుకోవడం కష్టం. అందుకే ఉన్న బ్యాంకుల్లోనే ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు చేపట్టాలని వేతనదారులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో? లేదో? చూడాలి.