Madhya Pradesh: మధ్యపదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. పవర్ పోవడంతో కుమారుడు లిప్ట్ లో ఇరుక్కుపోయాడన్న షాక్ లో ఓ తండ్రి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన భోపాల్ లోని రాయల్ ఫార్మ విల్లా కాలనీ లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే బాలుడు లిప్ట్ లో నుంచి సురక్షితంగా బయటపడిన కూడా షాక్ లో ఉన్న తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని సీపీఆర్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే రిషిరాజ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.