Dreams : కలల శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తికి వచ్చే కొన్ని కలలు అతని జీవితంలో జరిగే కొన్ని శుభ సంఘటనలను సూచిస్తాయి. మరికొన్ని కలలు అశుభమైనవిగా పరిగణిస్తారు. కొన్ని కలలు దారుణంగా వస్తే కొన్ని హాయిmental stateగా అనిపిస్తాయి. అయితే మరికొన్ని కలలు మాత్రం గందరగోళంగా అనిపిస్తాయి. ఇలాంటి కలలు మనిషిని నిద్ర పోనివ్వవు. అనుక్షణం భయపడుతుంటారు. అయితే కొన్నిసార్లు చాలా వింతైన కలలు కూడా వస్తాయి కదా. వాటి గురించి అర్థం చేసుకోవడం కష్టం. ఈ రోజు మనం కలలో గొడవ పడితే ఏం జరుగుతుంది? ఇలాంటి కల ఎందుకు వస్తుంది వంటి వివరాలు తెలుసుకుందామా?
స్నేహితులతో గొడవ.
మీరు మీ కలలో ఒక సన్నిహితుడితో గొడవపడుతున్నట్టు చూస్తే కలల శాస్త్రం ప్రకారం అది మీ నిజ జీవితానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. దీని అర్థం మీ స్నేహితుడు ఏదో సమస్యలో ఉన్నాడని కావచ్చు. లేదా మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రకమైన విభేదాలు ఉండవచ్చని కూడా దీని అర్థం. ఇలాంటి కలలు వస్తే కాస్త జాగ్రత్త వహించాలి.
Also Read : అసలు భారతీయులు అమెరికాలో స్థిరపడాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇందుకు కారణం ఏంటో తెలుసా ?
మీ భాగస్వామితో గొడవ
మీరు మీ భాగస్వామితో కలలో గొడవపడుతున్నట్టు వచ్చిన లేదా మీ భాగస్వామి వేరే వారితో గొడవపడుతున్నట్టు చూసినా సరే, అది నిజ జీవితానికి సంబంధించినదిగా పరిగణించాలి. దీని అర్థం మీరు మీ నిజ జీవితంలో కూడా సంబంధంలో ఇబ్బంది పడుతున్నారని కావచ్చు. అలాగే, అలాంటి కల మీ భాగస్వామితో విభేదాలను సూచిస్తుంది. మీకు నిజంగానే నిజజీవితంలో కూడా గొడవలు ఉంటే ఇద్దరు కచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించాలి. లేదంటే మీ రిలేషన్ మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది.
మీరు ఈ సంకేతాలను పొందవచ్చు
మీరు కలలో ఎవరితోనైనా పోరాడుతున్నట్లు కనిపిస్తే, మీలో కొంత భావోద్వేగం తగ్గిందని నమ్ముతారు. మరోవైపు, మీపై ఎవరైనా కోపంగా ఉన్నట్లు కల వస్తే మీ చుట్టూ ఉన్న పరిస్థితులలో కొంత మార్పు రావచ్చని కలల శాస్త్రం చెబుతుంది . అటువంటి పరిస్థితిలో, శ్రద్ధ అవసరం.
ఈ కల కూడా శుభప్రదం
కలలో గొడవ చూడటం కూడా సంపద, గౌరవాన్ని పొందడానికి చిహ్నంగా పరిగణిస్తారు. మీరు కలలో గొడవ పడుతున్నట్టు కనిపిస్తే, అది సమీప భవిష్యత్తులో మీకు ఆర్థిక లాభం చేకూరుస్తుందని కలల శాస్త్రంలో నమ్ముతారు. కానీ కొన్ని సందర్భాల్లో, కలలో గొడవ చూడటం జీవితంలో కొనసాగుతున్న ఉద్రిక్తత లేదా సంఘర్షణను కూడా సూచిస్తుంది.