MAA Elections: ‘మా’ ఎన్నికలు త్వరగా నిర్వహించాలి.. ప్రకాశ్ రాజ్
వీలైనంత త్వరగా మా ఎన్నికలు జరపాలని నటుడు ప్రకాశ్ రాజ్ కోరారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన మా సర్వసభ్య సమావేశంలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. వర్చువల్ గా నిర్వహించిన ఈ సమావేశంలో మా లోని కీలక సభ్యులు అసోసియేషన్ ఎన్నికలపై మాలోని సమస్యలు, ఇప్పటి వరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ వీలైతే సెప్టెంబర్ 12లేదా 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి […]
Written By:
, Updated On : August 22, 2021 / 03:20 PM IST

వీలైనంత త్వరగా మా ఎన్నికలు జరపాలని నటుడు ప్రకాశ్ రాజ్ కోరారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన మా సర్వసభ్య సమావేశంలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. వర్చువల్ గా నిర్వహించిన ఈ సమావేశంలో మా లోని కీలక సభ్యులు అసోసియేషన్ ఎన్నికలపై మాలోని సమస్యలు, ఇప్పటి వరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ వీలైతే సెప్టెంబర్ 12లేదా 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి అని కృష్ణంరాజుకి విజ్ఞప్తి చేశారు.