Revanth Reddy about KCR: కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలి : రేవంత్ రెడ్డి

  TPCC President Revanth Reddy: (Youth Congress) పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉద్బోధ చేశారు. కష్టపడి పనిచేయాలని సూచించారు. ఒక్క రోజులో ఎవరు కూడా గొప్ప వారు కారని చెప్పారు. కష్టపడి పని చేస్తే విజయం అదే వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా సుప్రీం కాదని కష్టపడి పని చేస్తేనే వారికి పదవులు ఇంటికి వస్తాయని భరోసా ఇచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారి పేర్లు […]

Written By: Srinivas, Updated On : August 22, 2021 3:44 pm
Follow us on

 

Telangana-youth-congress-meeting-oktelugu

TPCC President Revanth Reddy: (Youth Congress) పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉద్బోధ చేశారు. కష్టపడి పనిచేయాలని సూచించారు. ఒక్క రోజులో ఎవరు కూడా గొప్ప వారు కారని చెప్పారు. కష్టపడి పని చేస్తే విజయం అదే వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా సుప్రీం కాదని కష్టపడి పని చేస్తేనే వారికి పదవులు ఇంటికి వస్తాయని భరోసా ఇచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారి పేర్లు చెబుతూ వారిలో కేసీఆర్ పేరు కూడా చెప్పారు. ఆయన కూడా యూత్ కాంగ్రెస్ లీడర్ గా పనిచేశారని గుర్తు చేశారు. పార్టీ విధేయత కోసం కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు.

తెలుగు స్టేట్లలో ఉన్న నేతలంతా యూత్ కాంగ్రెస్ నుంచి ఎదిగిన వారే అని అన్నారు. అలా వచ్చిన వారిలో చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ కూడా ఉన్నారని చెప్పారు. యూత్ కాంగ్రెస్ నేతలంతా స్ఫూర్తి నింపినవారే అని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని చెప్పారు. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల గొప్పతనాన్ని కూడా ఒప్పుకుంటారు. ఇందులో భాగంగానే కేసీఆర్ ను కూడా పొగిడారు.

పార్టీ సంక్షోభ సమయంలో ఉన్నప్పుడే నాయకులు తయారవుతారని అన్నారు. కాంగ్రెస్ లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని చెప్పారు. మంచి ఎక్కడున్నా తీసుకోవాలని అన్నారు.  చెడు ఎక్కడున్నా దూరం చేయాలని సూచించారు.

రేవంత్ రెడ్డి వ్యతిరేకించేవారిని కూడా అభిమానిస్తారని తెలిసిందే. కేసీఆర్ ను ఎప్పుడు విమర్శించినా అవసరమైన సందర్భాల్లో మాత్రం ఎత్తుకుని అంత ప్లస్ పాయింట్లు తీసుకుని వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచిచడంతో ఆయనలో కూడా ఓ పాజిటివ్ నేచర్ ఉందని నిరూపించుకుంటున్నారు. నేతలంతా యాక్టివేట్ అయి రాజకీయాల్లో రాణించాలని కోరారు.