కోట్ల మంది ప్రాణాలు కాపాడిన లాక్ డౌన్లు.. ఆక్స్ ఫర్డ్

ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లు కోట్ల మంది ప్రాణాలు కాపాడినట్లు తాజాగా ఆక్స్ ఫర్డ్ యానివర్సిటీ నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఈ లాక్ డౌన్ లు బ్యాక్టీరియా రోగాలైన నిమోనియా, మెనింగిటిస్, సెప్సిస్ లాంటి వాటిని భారీగా తగ్గించగలిగాయని స్పష్టం చేసింది. క్రైస్ట్ చర్చ్ లోని ఒటగో యూనివర్సిటీ డీన్, అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ డేవిడ్ మర్దోక్ తో కలిసి ఆక్స్ ఫర్డ్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ వ్యాధుల సంక్రమణ […]

Written By: Suresh, Updated On : May 31, 2021 11:57 am
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లు కోట్ల మంది ప్రాణాలు కాపాడినట్లు తాజాగా ఆక్స్ ఫర్డ్ యానివర్సిటీ నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఈ లాక్ డౌన్ లు బ్యాక్టీరియా రోగాలైన నిమోనియా, మెనింగిటిస్, సెప్సిస్ లాంటి వాటిని భారీగా తగ్గించగలిగాయని స్పష్టం చేసింది. క్రైస్ట్ చర్చ్ లోని ఒటగో యూనివర్సిటీ డీన్, అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ డేవిడ్ మర్దోక్ తో కలిసి ఆక్స్ ఫర్డ్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ వ్యాధుల సంక్రమణ తగ్గిపోవడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలు కూడా నిలిచాయని ఇందులో తేల్చారు.