https://oktelugu.com/

ఆనందయ్య మందుపై తేల్చేసిన ఏపీ సర్కార్

రోజులు గడుస్తున్నా.. హైకోర్టు ఆదేశించినా కూడా ఆనందయ్య ఆయుర్వేద కరోనా నివారణ మందుపై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. దీనికి అనుమతి ఇవ్వాలా? ప్రభుత్వమే టేకప్ చేసి పంచాలా? లేక అనుమతులు నిషేధించాలా? అన్న విషయాలపై తర్జన భర్జన పడుతోంది. అయితేతాజాగా ఏపీ ఆయూష్ కమిషనర్ మాత్రం దీన్ని స్థానిక మందుగా పరిగణించి పంపిణీ చేయవచ్చని ఒక క్లారిటీ ఇచ్చారు. దానికోసం ఎలాంటి అభ్యంతరం లేదని మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. ఆనందయ్య మందును ఒక స్థానిక మందుగా.. […]

Written By: , Updated On : May 31, 2021 / 12:00 PM IST
Follow us on

రోజులు గడుస్తున్నా.. హైకోర్టు ఆదేశించినా కూడా ఆనందయ్య ఆయుర్వేద కరోనా నివారణ మందుపై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. దీనికి అనుమతి ఇవ్వాలా? ప్రభుత్వమే టేకప్ చేసి పంచాలా? లేక అనుమతులు నిషేధించాలా? అన్న విషయాలపై తర్జన భర్జన పడుతోంది.

అయితేతాజాగా ఏపీ ఆయూష్ కమిషనర్ మాత్రం దీన్ని స్థానిక మందుగా పరిగణించి పంపిణీ చేయవచ్చని ఒక క్లారిటీ ఇచ్చారు. దానికోసం ఎలాంటి అభ్యంతరం లేదని మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

ఆనందయ్య మందును ఒక స్థానిక మందుగా.. గృహవైద్యంగా.. మూలిక వైద్యంగా పంపిణీ చేయవచ్చని ఏపీ ఆయూష్ శాఖ కమిషనర్ వి. రాములు స్ఫష్టం చేశారు. దీనికి ఏపీ ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని.. చాలా మంది ఇంట్లోనూ .. గ్రామాల్లోనూ ఇలాంటి వి తయారు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఆనందయ్య ఆయుర్వేద మందును ఒక నాటుమందుగా ఏపీ ఆయూష్ శాఖ తేల్చింది. కేంద్రంలోని ఆయూష్ శాఖ, ఐసీఎంఆర్ పరిశోధిస్తున్నాయి. దానికి నెల రోజులు అయినా పడుతుందని అంటున్నారు. ఏపీ హైకోర్టు మాత్రం రెండు రోజుల్లోనే తేల్చాలని అనుమతించాలని కోరింది. మరి దీనిపై ఏపీ సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాలి.