
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను జప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో ఇవాళ లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన 5858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 4664 వాహనాలను జప్తు చేశారు. మొత్తంగా 8,094 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.