
లాక్ డౌన్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని క్యాబినెట్ లో నిర్ణయించారు. మరోవైపు టీకా కొనుగోళ్ల కోసం గ్లోబర్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.