
కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 14 వరకూ పొడిగించింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కరోనా కర్ఫ్యూ ను జూన్ 14 వరకూ పొడిగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన అనంతరం వారికి టెలిఫోన్ లో వైద్య నిపుణులతో కన్సల్టేషన్ సేవలు అందించాలని కేబినేట్ నిర్ణయించింది.