కర్ణాటకలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,784 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. ఇవాళ్టి వరకు బ్లాక్ ఫంగస్ తో 111 మంది మరణించారని వెల్లడించారు. మొత్తం 1,784 ఫంగస్ కేసుల్లో 62 మంది కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా బ్లాక్ ఫంగస్ చికిత్స అందించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.