తాజాగా హర్యానా ప్రభుత్వం మరో వారంపాటు లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు హర్యానా వైద్యరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే లాక్ డౌన్ గడువును వారం రోజులు పొడిగించినప్పటికీ లాక్ డౌన్ నిబంధనల్లో మాత్రం మరికొన్ని వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపింది.