
న్యూజిలాండ్ తో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా భోజన విరామం సమయానికి 211/7 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా (15), ఇషాంత్ శర్మ (2) ఉన్నారు. విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్ నిరాశపర్చారు. అశ్విన్ (22), జడేజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ధాటిగా ఆడే క్రమంలో ఆశ్విన్ సౌథీ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అనంతరం జడ్డూ, ఇషాంత్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ను ముగించారు.