
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయలో మండిపడుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ముమైత్ ఖాన్ తో పోలుస్తూ మాట్లాడిన కౌశిక్ రెడ్డిని శ్రీరెడ్డితో పోల్చారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాల్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్టారెడ్డి మాట్లాడుతూ సిగ్గు, శరం లేకుండా కౌశిక్ మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చే స్ర్కిఫ్టు చదివే నీకు సిగ్గు ఉండాలి అని అన్నారు. వైఎస్ నీకు టికెట్ ఇస్తా అని చెప్పిండా, అప్పడు నీ వయస్సు ఎంత, చెడ్డిలు కూడ వేసుకోలేదు బిడ్డా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.