
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్తగా మంజూరైన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడానికి సమకూర్చుకోవాల్సిన మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ చర్చించింది. అలాగే వ్యాక్సినేషన్ వేగవంతం చయాలని, ఔషధాలు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పూర్తి వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.