
పాపం అప్పుడు హాట్ బ్యూటీ అనసూయ మోసపోయింది. ఇప్పుడు హోమ్లీ బ్యూటీ పవిత్ర లోకేష్ మోసపోయింది. మోసం చేసే వారిని నమ్మడంతోనే వీరిద్దరూ మోసపోవడం బాధాకరమైన విషయం. అసలు పవిత్ర ఏ విషయంలో మోసపోయిందని ఆత్రుతగా అడుగుతున్నారు నెటిజన్లు. మోసం మేనేజర్ విషయంలో. నటి పవిత్రా లోకేశ్ ను ఆమె మేనేజర్ మోసం చేశాడు. దాదాపు రూ.60 లక్షలకు పైగా లెక్కల్లో తేడా చూపించి పవిత్రను దారుణంగా మోసం చేశాడట.
మొదటి నుండి పవిత్ర లోకేష్ తన మేనేజర్ ను గుడ్డిగా నమ్ముతూ వచ్చింది. నిజానికి ఆమెకు ఆఫర్లు లేని రోజుల నుండి ఆ మేనేజర్ ఆమెతోనే ఉన్నాడు. ఆమె బిజీ ఆర్టిస్ట్ గా మారడం వెనుక కూడా అతని తెలివితేటలు ఉన్నాయి. అందుకే, పవిత్ర లోకేష్ కూడా అన్ని రకాల లావాదేవీలను అతనికే అప్పగించింది. అయితే, తాజాగా పవిత్ర లోకేష్ కు జీఎస్‌టీ చెల్లింపులు చెల్లించలేదు అంటూ ప్రభుత్వం నుంచి ఆమెకు నోటీసులు వచ్చాయట.
ఆ నోటీసులు చూసి షాక్ అయింది పవిత్ర లోకేష్. విషయం అర్ధం చేసుకుంటే… తన మేనేజర్ తనను మోసం చేశాడని అర్థం అయింది. మొత్తానికి లెక్కలు అన్నీ చూసుకుంటే.. దాదాపు రూ.60 లక్షలకు పైగా లెక్కల్లో తేడా జరిగిందని తెలుస్తోంది. పాపం, పవిత్ర లోకేష్ ఎంతో కష్టపడి సంపాదించుకుంది. అయితే మేనేజర్ మాత్రం మరోలా మాట్లాడుతున్నాడట.
నీ సంపాదనకు నేను కూడా కారణం అంటున్నాడట. మొత్తానికి పవిత్రా లోకేశ్ మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయింది. గతంలో అనసూయకు ఇలాంటి సమస్యే ఎదురైంది. ఆమె మేనేజర్ ఆమెను దారుణంగా మోసం చేశాడు. తరువాత చేసేది ఏమి లేక అనసూయ సైలెంట్ పన్ను చెల్లించింది. ఇప్పుడు పవిత్ర పరిస్థితి అంతే. సినీ సెలెబ్రిటీలు ఇప్పటికైనా తమ ఆర్థిక లావాదేవీలను, పన్ను చెల్లింపుల వ్యవహారాలను తామే చూసుకుంటే బెటర్