RRR Movie: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ మూవీ నుంచి ఈ మూవీ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

జనవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్, లిరికల్ వీడియోలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుందట. పాటల నుండి ట్రైలర్ వరకూ అన్నీ సిద్ధం చేసిన రాజమౌళి ఇక ప్రమోషన్ సందడి మొదలు పెట్టనున్నాడట. ట్రైలర్ కూడా అన్ని బాషలకు తగ్గట్లే… ఆయా బాషల నటులను హైలెట్ చేసేలా కట్ చేయించిన జక్కన్న బాలీవుడ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు అనుకుంటున్నారు. ఈ నెలలో ఒక్కొకటి రిలికల్స్ సాంగ్స్ విడుదల చేయనున్న ఆర్ఆర్ఆర్ టీం డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్ వదిలేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారట. డిసెంబర్ 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుందని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.