
కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తన పర్యటనలో మెడికల్ కళాశాల ప్రకటన చేయాలని లేదంటే పర్యటనను అడ్డుకుంటామని మెడికల్ కళాశాల సాధన సమితి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.