తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతున్నది. నిన్న సుమారు 18,211 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 7,227 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.09 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. దర్శనానికి వచ్చే భక్తులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. తిరుమల కొండపై కొవిడ్ నిబంధనలను పక్కగా అమలు చేస్తున్నామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Written By:
, Updated On : June 20, 2021 / 09:42 AM IST