
ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్న సీఎంకు మంత్రులు ఎర్రబెల్లిదయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మేయర్ గుండు సుధారాణి, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.