
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత అగ్రెసివ్ నో అందరికీ తెలిసిందే. వికెట్లు పడ్డప్పుడు.. బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంత దూకుడుగా ఉంటాడో మనం చూస్తూనే ఉంటాం. మైదానంలో హుషారుగా ఉంటాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆటగాళ్లలో తనదైన జోష్ నింపుతుంటాడు. కోహ్లీ హావభావాలతోనే మైదానంలో ఆటగాళ్లు ఉత్సాహంగా ఉంటారు. కొన్ని సార్లు ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించడమే కాకుండా మైదానంలో స్టెప్పులూ వేస్తూ సందడి చేస్తుంటాడు.
తాజాగా ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ ఫైనల్ లోనూ విరాట్ కోహ్లీ సరదాగా కాలు కదిపాడు. పంజాబీ నృత్యమైన భాంగ్రా స్టెప్పులు వేశాడు. మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు డోలు వాయించారు. ఆ శబ్ధాలకు అనుగుణంగా మైదానంలో విరాట్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. చాలా మంది అభిమానులు విరాట్ డ్యాన్స్ దృశ్యాలను క్లిక్ మనిపించి కెమెరాల్లో బంధించారు.
విరాట్ కోహ్లీ డ్యాన్సింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాన్ని ఫ్యాన్స్ తెగ షేర్లు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా పోరాడాడు. న్యూజిలాండ్ పేసర్లు కట్టుదిట్టంగా బంతులు వేసినా స్వింగ్ చేసినా నిలకడగా ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడింది. 217 పరుగులకే అలౌట్ అయ్యింది. ఇక న్యూజింలాండ్ ప్రస్తుతం 101/2 పరుగులతో నిలకడగా ఆడుతోంది.