
కేసీఆర్ సీఎం అయ్యాక వారసత్వ సంపదను అందినకాడికి అమ్ముతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. వెయ్యికోట్ల కుంభకోణంపై వివరణ ఇస్తారని ఆశించామని, బంగారంకంటే విలువైన భూములను అమ్ముతూ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ఆనాడు ప్రాజెక్టుల కోసం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కాంగ్రెస్ అమ్మాలని చూస్తే కేసీఆర్ అడ్డుపడ్డారని రేవంత్ రెడ్డి అన్నారు. భూములను కేసీఆర్ తన బంధువులు, బినామీలకు కట్టబెడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.