Karun Nair: మరికొన్ని గంటల్లోనే ఇంగ్లాండ్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత కరుణ్ నాయర్ తిరిగి భారత జట్టులో స్థానం సంపాదించించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా బీసీసీఐ చేసిన పోస్ట్ తో కరుణ్ నాయర్ తుది జట్టులో ఉండటం ఖాయమనే సంకేతాలు కన్పిస్తున్నాయి. కరుణ్ నాయర్ రెడీ టూ గో అని ఎక్స్ ఖాతాలో ఓ పొస్ట్ చేసిన బీసీసీఐ.. సిరీస్ కు ముందు అతడు మాట్లాడిన వీడియోను పంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ కు తుది జట్టులో కురుణ్ ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు.
This is Karun Nair and he is ! #TeamIndia | #ENGvIND | @karun126
— BCCI (@BCCI) June 20, 2025