Karimnagar Jewellery Robbery: తెలంగాణలోని కరీంనగర్ నగర నడిబొడ్డున పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన సాయుధ దోపిడీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పట్టపగలే ఐదుగురు దుండగులు తుపాకులతో షోరూమ్‌లోకి చొరబడి, సిబ్బందిని తుపాకులతో బెదిరించి కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది గాయపడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
దొంగల కోసం గాలింపు..
దోపిడీకి పాల్పడిన దొంగల కోసం పోలీసులు 20 బృందాలుగా గాలిస్తున్నారు. ఇప్పటికే దొంగలు రాష్ట్రం దాటినట్లు పోలీసులు గుర్తించారు. వారు ఏమార్గంలో ప్రయాణించారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. నిందితులు పరారైన పల్సర్ బైక్‌ను ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో పోలీసులు గుర్తించారు. బైక్‌తోపాటు సమీపంలోనే హెల్మెట్‌ను కూడా వదిలివెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్న పోలీసులు, గోదావరి తీర ప్రాంత గ్రామాలతో పాటు అటవీ పరిసరాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మహారాష్ట్రకు పరార్..
పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తాజాగా ధర్మపురి పుష్కర ఘాట్ వద్ద దోపిడీకి ఉపయోగించిన పల్సర్ బైక్ మరియు హెల్మెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాల ద్వారా దుండగుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. నిందితులు సారంగాపూర్ మండలం బీర్పూర్ గోదావరి మార్గం మీదుగా మహారాష్ట్రకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ముమ్మరంగా తనిఖీలు
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పర్యవేక్షణలో బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని స్థానికులు, వ్యాపారవేత్తలు కోరుతున్నారు. నిందితుల గాలింపు కోసం స