
ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తారక్ కు కరోనా అని తెలిసి అభిమానులే కాదు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్స్ కూడా ఆయన ఆరోగ్యం పై ఆరాలు తీశారు. కొద్ది సేపటి క్రితం ఎన్టీఆర్ మరోసారి కరోనా టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ అని వచ్చిందని చెప్పడానికి సంతోసంగా ఉంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కిమ్స్ హాస్పటల్ కు చెందిన డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, మా కజిన్ డాక్టర్ వీరు, టెనెట్ డయాగ్నిస్టిక్స్ లకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే పాజిటివ్ మైండ్ తో ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాని తరిమికొట్టవచ్చు అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.