
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టిన జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు వెల్లడించారు. డిమాండ్లన్నీ నెరవేర్చకున్నా సీఎం హామీతో సమ్మె విరమిస్తున్నట్లు చెప్పారు. పెంచిన స్టైపండ్, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నెల 10 న జూడాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సీఎం నిర్నయించారు. మూడేళ్ల వైద్య విద్య అభ్యసింది కరోనా సేవలందిస్తున్న వైద్య విద్యార్థులకూ సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనం అందించాలని ఆదేశించారు.