ఆనందయ్య నాటు మందు స్ఫూర్తితో భీమయ్య

కరోనా నివారణకు నాటు మందులు పుట్టుకొస్తున్నాయి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఇదివరకే కరోనా వైరస్ నిర్మూలనకు ఆనందయ్య నాటు మందు ప్రచారం సాగుతుండగా తెలంగాణలోనూ కరోనా తగ్గించడానికి బచ్చలి భీమయ్య పుట్టుకొచ్చాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని మారుతీనగర్ కు చెందిన భీమయ్య కరోనా తగ్గించేందుకు మందు వేస్తామని చెబుతున్నాడు. దీంతో నాటు మందుల వ్యవహారం వైరల్ గా మారింది. మందమర్రి పట్టణంలోని భీమయ్య గతంలో సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తన పూర్వీకుల నుంచి […]

Written By: admin, Updated On : May 27, 2021 7:58 pm
Follow us on

కరోనా నివారణకు నాటు మందులు పుట్టుకొస్తున్నాయి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఇదివరకే కరోనా వైరస్ నిర్మూలనకు ఆనందయ్య నాటు మందు ప్రచారం సాగుతుండగా తెలంగాణలోనూ కరోనా తగ్గించడానికి బచ్చలి భీమయ్య పుట్టుకొచ్చాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని మారుతీనగర్ కు చెందిన భీమయ్య కరోనా తగ్గించేందుకు మందు వేస్తామని చెబుతున్నాడు. దీంతో నాటు మందుల వ్యవహారం వైరల్ గా మారింది.

మందమర్రి పట్టణంలోని భీమయ్య గతంలో సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తన పూర్వీకుల నుంచి నేర్చుకున్న వనమూలికల వైద్యం ద్వారా కరోనాకు విరుగుడుగా నాటు మందు పంపిణీ చేస్తున్నారు. 13 రకాల వనమూలికలతో ఈ మందు తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. దమ్ము, దగ్గు, ఊపిరితిత్తుల కోసం మందు పని చేస్తుందని పేర్కొన్నాడు.

ఆనందయ్య మాదిరిగానే భీమయ్య కూడా నాటు మందు ఉచితంగానే ఇస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ప్రచారం బాగానే చేసుకున్నాడు. మారుతీనగర్ లోని ఆయన నివాసం వద్ద కరోనా మందు కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖానికి మాస్కు ధరించకుండానే రోగులకు మందు ఇస్తున్నాడని పేర్కొంటున్నారు. మందు తీసుకున్న రో గులకు రెండు గంటల్లోనే తగ్గిపోతోందని చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే మందును ఇంకా ఎ క్కువ మందికి ఇచ్చేందుకు తయారు చేస్తానని చెబుతున్నాడు.

భీమయ్య మందు కోసం వచ్చే వారి సంఖ్య పెరగడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో బుధవారం వారు భీమయ్యను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతులు లేకుండా మందు ఎలా ఇస్తున్నావని ప్రశ్నించారు. మందు పంపిణీ నిలిపివేయాలని సూచించారు. అయితే భీమయ్య ఇంతవరకు ఎవరికీ చికిత్స అందించలేదని ఎస్సై భూమేష్ పేర్కొన్నారు.

ఆనందయ్య స్పూర్తితో చాలా మంది నాటు మందు పంపిణీపై ప్రచారం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తె లుగు రాష్ర్టాల్లోని రాజమండ్రి, కడప, మందమర్రి లాంటి ప్రాంతాల్లో తమ నాటు మందుతో కరోనా తగ్గిపోతుందని ప్రచారం చేస్తున్నారు.