Jr NTR wrong step :
సినిమా ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇక్కడ ఎదురయ్యే పోటీని తట్టుకోని నిలబడే కెపాసిటి కొందరికి మాత్రమే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు… ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరిలో జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఏక సంతాగ్రహిగా తనకు ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఒకసారి విన్న వెంటనే ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగల్ టేక్ లో చేసి మెప్పించగలిగే కెపాసిటి ఆయన సొంతం… అలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా బాట పట్టాడు. దేవర సినిమాతో పాన్ ఇండియాలో 500 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు చేయడంలో చాలా వరకు వెనుకబడిపోయాడు. ‘దేవర’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన ఆయన కేవలం యావరేజ్ హిట్ ను మాత్రమే నమోదు చేసుకున్నాడు. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి 500 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రావడంతో జూనియర్ ఎన్టీఆర్ అనుకున్న రేంజ్ లో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.
దాంతో చాలామంది ప్రేక్షకులు సైతం అతని మీద నెగెటివ్ కామెంట్లు చేశారు. గత సంవత్సరం హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించలేదు. తద్వారా ఆ సినిమా విషయంలో కూడా ఆయన రాంగ్ స్టెప్ వేసాడు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు…
ఇక ఇప్పటికైనా ఆయన పాన్ ఇండియా మార్కెట్ ను దక్కించుకోకపోతే మాత్రం ఇక ఆయన ఇప్పుడన్నా స్టార్ హీరోలందరికంటే చాలా వరకు వెనుకబడి పోయే ప్రమాదమైతే ఉంది. మరి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ముందుకు అడుగులు వేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…