
ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్ లో నివసిస్తున్న ఎస్వీ ప్రసాద్ కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బారిన పడింది. దీంతో ప్రసాద్ దంపుతులు యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటుండగానే పరిస్థితి విషమించి మృతి చెందారు. ఎస్వీ ప్రసాద్ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో సీఎస్ గా సేవలందించారు.