https://oktelugu.com/

కేంద్రంతో మమత ఢీ.. తగ్గేది లే!

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్కడా తగ్గడం లేదు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది. కేంద్రంతో నేరుగా తలపడుతోంది. ఇటీవల మోడీ నిర్వహించిన తుఫాన్ సమీక్ష సమావేశానికి మమతా బెనర్జీతోపాటు బెంగాల్ సీఎస్ అలపన్ బందోపాధ్యాయ కూడా 30 నిమిషాలు లేట్ గా హాజరయ్యారు. దీంతో సీరియస్ అయిన కేంద్రం వెంటనే సీఎస్ ను ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే తమ చీఫ్ సెక్రటరీ అలప్ ను కేంద్రానికి పంపే ప్రసక్తే లేదని […]

Written By:
  • NARESH
  • , Updated On : June 1, 2021 / 09:11 AM IST
    Follow us on

    పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్కడా తగ్గడం లేదు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది. కేంద్రంతో నేరుగా తలపడుతోంది. ఇటీవల మోడీ నిర్వహించిన తుఫాన్ సమీక్ష సమావేశానికి మమతా బెనర్జీతోపాటు బెంగాల్ సీఎస్ అలపన్ బందోపాధ్యాయ కూడా 30 నిమిషాలు లేట్ గా హాజరయ్యారు. దీంతో సీరియస్ అయిన కేంద్రం వెంటనే సీఎస్ ను ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది.

    అయితే తమ చీఫ్ సెక్రటరీ అలప్ ను కేంద్రానికి పంపే ప్రసక్తే లేదని ప్రకటించిన సీఎం మమతా బెనర్జీ సోమవారం నాటకీయంగా చక్రం తిప్పారు. సీఎస్ ను రిటైర్ చేయించి తన ప్రభుత్వానికి మూడేళ్ల పాటు ముఖ్య సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. సీఎస్ ను కేంద్రానికి డిప్యూట్ చేయబోనంటూ ప్రధాని మోడీకి లేఖ రాసిన కొద్దిసేపటికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ఇక బందోపాధ్యాయ రిటైర్ కాగానే మరో సీనియర్ అధికారి ద్వివేదీ కొత్త బెంగాల్ సీఎస్ గా నియమితులయ్యారు. బందోపాధ్యాయ విషయంలో కేంద్రం ఉత్తర్వులు తనకు షాక్ కలిగించాయని.. ఈ కోవిడ్ పాండమిక్ సమయంలోనూ యాస్ తుఫాన్ వల్ల తలెత్తిన నష్టాల తరుణంలోనూ ఆయన సేవలు రాష్ట్రానికి, ప్రభుత్వానికి పేదలకు ఎంతో అవసరమని మమత పేర్కొన్నారు.

    ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసే అధికారికి అవమానం జరిగాక ఆ ప్రభుత్వం, కేంద్రం, ప్రధాని ఏం సందేహం ఇవ్వదలుచుకున్నారని మమత ప్రశ్నించారు.

    నిజానికి కేంద్రంతో ఈ లెవల్ లో పోరాడడం.. కేంద్రప్రభుత్వ సర్వీసు అధికారులను కూడా తను నియంత్రించడం బెంగాల్ సీఎం మమతకే చెల్లింది. బెంగాల్ సీఎస్ విషయంలో మమత తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పెను సంచలనమైంది. ఇప్పటికే కేంద్రం, బెంగాల్ మధ్య తీవ్ర విభేదాలు సాగుతున్న సమయంలో ఈ పరిణామం అగ్నికి ఆజ్యంపోసినట్టైంది.