
నాలుగో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 40 ఒవర్లకు 119/2 స్కోర్ తో నిలిచింది. ఈ సెషన్ లో మొత్తం ఇంగ్లాండ్ 94 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జోరూట్ (56), సిబ్లీ (27) పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ 73 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. ఒపెనర్ రోరీ బర్న్స్ (18) జాక్ క్రాలీ (6) విఫలమయ్యారు. సిరాజ్, బుమ్రా చిరో వికెట్ తీశారు.