Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy : పక్క రాష్ట్రం విజయంలో ఓదార్పు వెతుక్కుంటున్న జగన్

YS Jagan Mohan Reddy : పక్క రాష్ట్రం విజయంలో ఓదార్పు వెతుక్కుంటున్న జగన్

YS Jagan Mohan Reddy : ప్రతిపక్షంలో ఉన్నవారు గుణపాఠాలు నేర్చుకోవాలి. ఓటమి ఎదురైతే ఎక్కడ లోపం జరిగిందో గుర్తించాలి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయడం లేదు. ఎంతవరకు ప్రత్యర్థి పార్టీలపై ఏడుపు తప్ప.. పార్టీ పూర్వ వైభవం తీసుకురా ఎలా అడుగులు వేయాలి అనే దానిపై ఆ పార్టీ దృష్టి పెట్టడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఇబ్బందికరంగా ఉంది. కానీ పక్క పార్టీ ఇబ్బందుల్లో ఉందని చెప్పే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ. తమిళనాడులో విజయ్ గెలిస్తే.. ఏపీలో పవన్ ఓటమి అంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకునే స్థితికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. విజయ్ ను చూసి పవన్ నేర్చుకోవాలని సూచిస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అదే విజయ్ ను చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. విజయ్ తన పార్టీని నడిపిస్తున్న తీరుతోనైనా జగన్ కు కనువిప్పు కలగాలి. కానీ అలా చేయకుండా విజయ్ గెలుపును పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ ఎద్దేవా చేయడం చూస్తుంటే ఎంత దిగజారుడో అర్థం అవుతోంది.

* చిన్న పార్టీలతో కలిసి..
విజయ్ మెజారిటీకి కూతవేటు దూరంలో నిలిచిపోయారు. కానీ చిన్న చిన్న పార్టీలను కలుపుకొని ఇప్పుడు అధికారం చేపట్టారు. ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏం చేసేవారు అంటే.. ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ కూడా ఆయన వెంట అడుగులు వేయదు అనేది విశ్లేషకుల వాదన. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రాజకీయ పార్టీని కూడా గౌరవించలేదు. ప్రజా సంఘాలను సైతం తరిమేశారు. పైగా సింహం సింగిల్ అంటూ పెద్దపెద్ద మాటలు అన్నారు. అందుకే ఆ పార్టీకి వేరే ఆప్షన్ ఉండేది కాదు. 2029 ఎన్నికల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఒక్క పార్టీ చూసే పరిస్థితి లేదు.

* పదేళ్ల పాటు ఓపికగా పోరాడి
2024 ఎన్నికల్లో పవన్ గెలిచిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రజలను ఒప్పించి అధికారంలోకి వచ్చిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. తనపై గెలిచిన పవన్ ను చూసి నేర్చుకోవాల్సిన జగన్.. పక్క రాష్ట్రంలో విజయ్ ను అడ్డం పెట్టుకొని విమర్శలు చేయడం వ్యక్తిగత ద్వేషం కిందకి వస్తుంది. పక్క పార్టీల విజయాలలో ఓదార్పు వెతుక్కుంటున్నారు జగన్. పవన్ పదేళ్లపాటు ఓపిక పడ్డారు. ప్రజలు తనను ఓడించిన వారిపై ఎటువంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పదేళ్లపాటు పోరాడి జీరో నుంచి హీరో అయ్యారు ఆయన . కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారాన్ని పోగొట్టుకొని.. ఇప్పుడు అడ్రస్ వెతుక్కునే పనిలో ఉన్నారు. విజయ్ సాధించిన విజయం ఆయన టీం వర్క్. పవన్ సాధించిన విజయం ఆయన నిబద్ధత. ఆ రెండింటినీ మరిచి.. తాము ఒక ప్రతిపక్ష నాయకుడిని అని మరిచి జగన్ వ్యవహరిస్తున్నారు. అంతిమంగా అది ఆ పార్టీకి నష్టమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version