Jagan Mohan Reddy : విదేశీ పర్యటన ముగించుకుని జగన్మోహన్ రెడ్డి బెంగళూరు చేరుకున్నారు. కొద్ది రోజుల కిందట సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లారు. గత కొద్ది రోజులుగా అక్కడే గడిపారు. కోర్టు అనుమతి గడువు తీయడంతో ఆయన తిరిగి దేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. రేపు తాడేపల్లి కి రానున్నారు. ఈ నెల చివర్లో నెల్లూరు జిల్లాలో టిడిపి మహానాడు జరగనుంది. నెల్లూరులో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. రాజకీయంగా కూటమి పట్టు బిగించే ప్రయత్నం కచ్చితంగా చేస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి రేపు వైసిపి కీలక నేతలతో మంతనాలు జరపనున్నారు. కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సమాచారం అందింది. రేపు తాడేపల్లి కి జగన్ వచ్చిన వెంటనే ఈ సమావేశం మొదలవుతుంది.
* ప్లీనరీ నిర్వహణపై..
తెలుగుదేశం పార్టీ మహానాడు మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది కచ్చితంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. కానీ వచ్చే ఏడాది పాదయాత్ర ముంగిట.. ప్లీనరీ నిర్వహిద్దామని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.. అయితే పాదయాత్ర ముందు సమయం ఉండదని.. అందుకే ఇప్పుడే నిర్వహించుకోవడం మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. రేపు జరిగే సమావేశంలో ప్లీనరీపై ఒక నిర్ణయానికి రానున్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
* జనంలోకి వెళ్లేందుకు..
మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జగన్ పర్యటనలు ఉంటాయని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. దానిపై కూడా రేపు తాడేపల్లిలో నేతలతో చర్చిస్తారు జగన్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏడు రోజులు సమయం కేటాయిస్తారని.. ఒక్కో నియోజకవర్గంలో 100 మంది వరకు నేతలతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ జిల్లాల పర్యటనకు సంబంధించి చాలా రోజులుగా ప్రచారం నడుస్తూ వచ్చింది. గత సంక్రాంతి తర్వాత అన్నారు. ఈ సంక్రాంతి దాటిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యకు వచ్చింది లేదు. అయితే జనంలోకి వెళ్తే కానీ ప్రజలు హర్షించారని.. కచ్చితంగా జనం మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రస్తావించాలని సీనియర్లు కోరుతున్నారు. అందుకే రేపు అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రెండు అంశాలపై కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పార్టీ శ్రేణుల ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు.