Jagan Mohan Reddy : జగన్ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వ్యవహరించాడు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి ఏకంగా 151 స్థానాలు గెలుచుకున్నాడు. భారీగానే పార్లమెంటు స్థానాలు కూడా సొంతం చేసుకున్నాడు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు.. దేశ రాజకీయాలలోనూ సంచలనం సృష్టించాడు. ఇలా వచ్చిన విజయాన్ని.. సుస్థిరం చేసుకోకుండా.. గొప్ప పరిపాలన చేయకుండా.. కక్షపూరితమైన రాజకీయాలు చేసి పరువు తీసుకున్నాడు.
2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాడు. ప్రతిపక్ష స్థానం కోసం దేబిరించాడు. సొంత చెల్లి మీద కోర్టుకు వెళ్లాడు. ఇక ఇదే క్రమంలో జగన్ నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి చాలామంది పార్టీకి దూరమయ్యారు. ఇందులో విజయసాయిరెడ్డి కూడా ఒకరు.. అధికారానికి దూరం అయిన తర్వాత.. ప్రజల్లో తన పార్టీ మీద నమ్మకం పెంపొందించడానికి ప్రయత్నాలు చేయాల్సిన జగన్.. వింతగా ప్రవర్తిస్తున్నారు. విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. జనాలలో ఆయనను పలచన చేస్తున్నాయి.
వైసిపి మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనాన్ని ఇష్టానుసారంగా నడిపాడు. ఒక గొర్రెల కాపరి మరణానికి కారణమయ్యాడు. దీనిని దాచడానికి అప్పలరాజు అనేక రకాల కుట్రలకు పాల్పడ్డాడు. తన కుమారుడి స్థానంలో వేరొక వ్యక్తి బైక్ నడిపాడని డ్రామాలు ఆడాడు. అయితే పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో అప్పలరాజు నాటకాలు భయపడ్డాయి. దీంతో అప్పలరాజు తన కుమారుడిని పోలీసులకు అప్పగించక తప్పలేదు. అయితే ఈ విషయాన్ని జగన్ మరో విధంగా చెప్పారు.
అప్పల రాజు కుమార్ రెడ్డి వయసు కేవలం 18 సంవత్సరాల మాత్రమేనని.. రోడ్డు ప్రమాదానికి కారణమై.. ఒక వ్యక్తిని చంపితే ఆ మాత్రం దానికి అరెస్ట్ చేస్తారంటూ ప్రభుత్వం మీద మండిపడ్డారు. అంతేకాదు.. కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక హంతకుడికి వత్తాసు పలకడం.. అరెస్ట్ చేసిన పోలీసులను తిట్టడం నిజంగా హాస్యాస్పదం. సాయి కృష్ణ విషయంలోనూ జగన్ ఇలానే వ్యవహరించారు. ఇప్పుడు అప్పల రాజ కుమారుడి విషయంలో కూడా ఇలానే మాట్లాడారు. హంతకులకు వత్తాసు పలుకుతూ.. జగన్ ఏపీ ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారో అర్థం కావడంలేదని.. టిడిపి నేతలు అంటున్నారు.
Hey Ram
Save YSRCP from YS Jagan.. pic.twitter.com/hvswEKRzAJ
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 14, 2026
