
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని తప్పుకున్న క్రమంలో సీఎస్కే జట్టుకు ఎక్కువ కాలం కెప్టెన్సీ చేయలేడని వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే సీఎస్కే ఫ్యాన్స్ ఆర్మీ ఒక ట్వీట్ చేసింది. ధోని తర్వాత సీఎస్కే కు కెప్టెన్ ఎవరైతే బాగుంటుందని అడిగింది. ఆ ట్వీట్ కు జడేజా స్పందిస్తూ జెర్సీ నం 8 అని ట్వీట్ చేశాడు. అయితే కాసేపటికే దాన్ని డిలీజ్ చేశాడు. అప్పటికే ఆ స్క్రేన్ షాట్ వైరల్ అయింది. జడేజా జెర్సీ నం. 8 కావడం గమనార్హం.