Homeజాతీయ వార్తలుITBP jawan mother case : ఒక సైనికుడికి అన్యాయం.. కదిలిన భారత సైన్యం.. దెబ్బకు...

ITBP jawan mother case : ఒక సైనికుడికి అన్యాయం.. కదిలిన భారత సైన్యం.. దెబ్బకు పోలీసుల కాళ్ల బేరం

ITBP jawan mother case : ఒక జవాన్ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతుంటే, అతని కన్నతల్లి నగరంలోని ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి చేతి కోల్పోయింది. ఇది వ్యక్తిగత విషాదం కాదు. వైద్య వ్యవస్థలో లోపం. వైద్యో నారాయణో హరి అంటారు. కానీ వైద్యం వ్యాపారంగా మారింది. వైద్యులు బిజినెస్‌ చేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో వైద్యుల బాధ్యతారహిత్యానికి ప్రతీక ఘటన కాన్పూర్‌లో జరిగింది. ఇది దేశానికి సేవ చేసే వీరుల కుటుంబాలపై మన సమాజం చూపుతున్న ఉదాసీనతకు ఉదాహరణ.

ఏం జరిగిందంటే..
ఐటీబీపీ జవాన్ వికాస్ సింగ్ తల్లి నిర్మలాదేవి(56) అనారోగ్యంతో కృష్ణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. ఆమెను వెంటిలేటర్‌పై ఉంచినట్లు చెప్పి సంతకాలు మాత్రమే తీసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. నొప్పితో నిర్మలా దేవి తల్లడిల్లినా పట్టించుకోలేదు. నల్లబడి వాచిపోయినా స్పందించలేదు. చివరికి రక్తప్రసరణ ఆగిపోయి కణజాలం కుళ్లిపోయి చేయి తొలగించాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇది వైద్యుల నిర్లక్షా‍్యనికి, ఆసుపత్రి అలసత్వానికి నిదర్శనం. ఇది ఒక్కసారి జరిగిన పొరపాటు కాదని, ఇదే ఆసుపత్రిలో గతంలో కూడా సైనిక, పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

కత్తిరించిన చేతితో ఆందోళన..
ఈ నేపథ్యంలో జవాన్ వికాస్ సింగ్ చేసిన ప్రతిస్పందన హృదయవిదారకం. తన తల్లి కత్తిరించిన చేతిని థర్మోకోల్ బాక్సులో పెట్టుకొని కమిషనరేట్ మెట్లు ఎక్కారు. పోలీసులు మొదట ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించడం, తర్వాత ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ‘బోగస్’ నివేదిక ఇవ్వడం దేశంలో సాధారణమైపోయిన అధికారిక బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతుంది. అయితే ఈ ఘటనలో నిజమైన ఆశాకిరణం ఐటీబీపీ బలగాల స్పందన. కమాండెంట్ గౌరవ్ ప్రసాద్ నేతృత్వంలో సుమారు 50 మంది యూనిఫాం ధరించి కమిషనరేట్‌ను చుట్టుముట్టి, క్రమశిక్షణతో, సంయమనంతో న్యాయం కోసం డిమాండ్ చేయడం చాలా అర్థవంతమైన చర్య. దేశాన్ని కాపాడే సైనికులు తమ తోటి జవాన్‌కు జరిగిన అన్యాయాన్ని ఊరుకోలేకపోవడం సైనిక సోదరత్వానికి, సంస్థాగత గౌరవానికి నిదర్శనం. ఈ చర్య వల్లే కమిషనర్ కొత్త విచారణకు ఆదేశించి, బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సంఘటన మనకు కొన్ని కఠిన సత్యాలను గుర్తు చేస్తోంది. సరిహద్దుల్లో రక్తం కార్చే వీరుల కుటుంబాలు కనీసం నగరాల్లో మంచి వైద్యం, న్యాయం ఆశించడం ఎంతో అన్యాయం. ప్యానెల్ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి నిర్లక్ష్యం జరగడం ఆందోళనకరం. వైద్య రంగంలో బాధ్యతా బాహ్యత, పోలీసు వ్యవస్థలో స్పందన లేకపోవడం ఇవి కేవలం ఒక్క జవాన్ కుటుంబానికి మాత్రమే కాదు, మొత్తం దేశ భద్రతా యంత్రాంగానికి సంబంధించిన విషయాలు. ఈ ఘటన నుంచి పాఠం నేర్చుకోవాలి. నిర్లక్ష్యం చేసిన వైద్యులపై కఠిన చర్యలు, ఆసుపత్రికి తగిన శిక్ష, జవాన్ కుటుంబానికి పూర్తి న్యాయం మరియు పరిహారం అందించాలి.

సైనికుల కుటుంబాలకు ప్రత్యేక వైద్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. ఒక జవాన్ కన్నీరు వ్యవస్థలను కదిలించినప్పుడు, ఆ సైన్యం కదలడం సహజం. కానీ ఈ సైనికులు ప్రతిరోజూ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నప్పుడు, వారి కుటుంబాలు ఇంట్లో భద్రతగా ఉండాలి. ఇది కేవలం ఒక కేసు కాదు.. మన జాతీయ బాధ్యత.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version