
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి ప్రమాదం తప్పంది. ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పి పోయింది. టేకాఫ్ సమయంలో రన్ వేపై సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. గాల్లోకి లేచే సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. ఢిల్లీ నుంచి ఈటల బృందం ప్రత్యేక విమానం బయలు దేరింది. మాజీమంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్, వివేక్, ఏనుగు రవీంరద్ రెడ్డి, తుల ఉమా తో పాటు మొత్తం 184 మంది విమానంలో ఉన్నారు.