రజనీకాంత్ కు తమిళంలోనే కాకుండా విదేశాల్లోనూ అభిమానులున్నారు. ఆయన నటనకు ఆసక్తి చూపని వారు ఎవరు లేరు. అంతటి ఇమేజ్ సంపాదించుకున్న రజనీకి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ప్రాధాన్యం సంపాదించుకున్నారు. ఆయన రాకను అమెరికా మీడియా కూడా ప్రచారం చేస్తోంది. కుటుంబ సమేతంగా వచ్చిన రజనీ అమెరికాలో ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారని తెలుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ లో రజనీకాంత్ షూటింగులతో బిజీగా ఉన్నారు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్ కమర్షియల్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో అన్నత్తే అనే సినిమాలో రజనీ నటిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఆ సినిమా షూటింగ్ జరిగింది. అర్ధరాత్రి సమయంలో కూడా షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ లో షూటింగ్ పనులకు ప్యాకప్ చెప్పి చెన్సైకి వెళ్లిపోయిన రజనీకాంత్ ఇటీవల అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియాలో కొవిడ్ ప్రభావం ఎక్కువ కావడం వల్ల హెల్త్ చెకప్ కోసం తలైవా అమెరికా వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించినప్పటికి రజనీకాంత్ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు సమాచారం.