టోటల్ అన్ లాక్ దిశగా తెలంగాణ

సీఎం కేసీఆర్ ప్రజలకు ఇబ్బందులు కలిగించే.. అదే సమయంలో ఆర్థికంగా నష్టం వాటిల్లేలా చేస్తున్న లాక్ డౌన్ పై అయిష్టంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే అన్నీ రాష్ట్రాలు పెట్టాకే తెలంగాణలో కరోనా కేసులు తీవ్రత ఎక్కువైన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టేశాడు. ఇంకా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు ఉన్నా కూడా తెలంగాణలో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా రిలాక్స్ ఇచ్చేశాడు. ఈనెల 19 వరకు ఈ […]

Written By: NARESH, Updated On : June 15, 2021 11:25 am
Follow us on

సీఎం కేసీఆర్ ప్రజలకు ఇబ్బందులు కలిగించే.. అదే సమయంలో ఆర్థికంగా నష్టం వాటిల్లేలా చేస్తున్న లాక్ డౌన్ పై అయిష్టంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే అన్నీ రాష్ట్రాలు పెట్టాకే తెలంగాణలో కరోనా కేసులు తీవ్రత ఎక్కువైన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టేశాడు. ఇంకా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు ఉన్నా కూడా తెలంగాణలో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా రిలాక్స్ ఇచ్చేశాడు. ఈనెల 19 వరకు ఈ లాక్ డౌన్ నిబంధనలు ఉండనున్నాయి.

మరో నాలుగురోజుల్లో ఈ గడువు కూడా ముగుస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని సడలింపులు దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈసారి లాక్ డౌన్ సమయాన్ని మరింత కుదించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడట.. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చి కేవలం రాత్రి కొద్దిసేపు మాత్రమే అదీ నామ్ కే వాస్తేగా లాక్ డౌన్ పెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడట..

ప్రస్తుతం తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మినహాయింపులున్నాయి. రాత్రంతా లాక్ డౌన్ ఉంటుంది. ఈనెల 20నుంచి రాత్రి 9 గంటల దాకా మినహాయింపులు ఇవ్వనున్నారని తెలిసింది. అంతేకాదు రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే లాక్ డౌన్ పెట్టే దిశగా కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక వివాదాస్పదమవుతున్న ఈ-పాస్ విధానానికి కూడా స్వస్తి పలకాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇక ప్రస్తుతానికి బార్లు, పబ్బులు, థియేటర్లు లాంటి వాటికే తెలంగాణలో ఆంక్షలు ఉంటాయి. మిగతా అన్నీ రంగాలను పట్టాలెక్కించేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెలాఖరుతో వీటిన్నింటిని ఎత్తివేసే దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.